Saturday, April 27, 2024

దత్త కుటుంబ సభ్యులందరికీ గురుపూర్ణిమ ఆశీస్సులు

సద్గురువుని భక్తితో, ప్రేమతో కొలుచుకోండి. ఆశ్రమ నిర్వాహకులు, సభ్యులు ఈర్ష్యాద్వేషాలు లేకుండా సేవ చేసుకోండి. ఇతర సభ్యులు పాల్గొనటం లేదని, సహకరించటం లేదని ఎవరినీ నిందించకండి. ఇతరులపై తీర్పు చెప్పటానికి వారి వారి పూర్వరంగం, వారు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం మీకు తెలియవు. సద్గురువు దగ్గరకు చేరటానికి, సేవలలో పాలుపంచుకోవటానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి. అందరిలోనూ లోపాలు ఉన్నాయి. గురువుతో ప్రతి వ్యక్తికి గల సంబంధం విశిష్టమైనది. అందరికీ అవకాశం ఇవ్వండి. మీ ఒక్కరిదే సరైన సద్ధతి అనుకోవద్దు. ఒకరినొకరు నమ్మి, సహకరించి పని చేయండి. వ్యతిరేకించకుండా, సామరస్యంగా పనిచేస్తే పొందే లాభాన్ని మీరే గమనిస్తారు. ఎవరికి పేరు వస్తుందన్న ప్రసక్తి విడిచి కృషి చేస్తే అమోఘమైన ఫలితాలు కనిపిస్తాయి. కలిసికట్టుగా సేవ చెయ్యటంలో నేను ఉండదు, మేము ఉంటుంది. ఇలా చేస్తేనే ఆశ్రమాలు వృద్ధిలోకి వస్తాయి. స్వామీజీ సంతోషిస్తారు. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చేసే సామర్థ్యం ఇస్తాడు. అందరూ ఇక్కడికి ఎదో ఒక ప్రత్యేక లక్ష్యంతో వచ్చారు. స్వామీజీతో మీకు ఉన్న బంధాన్ని బలపరచుకోండి. ఎవరికి ఏది మంచిదో స్వామీజీకి తెలుసు.

మీ స్వామీజీ..

Advertisement

తాజా వార్తలు

Advertisement