Saturday, May 25, 2024

జీవితం-సప్తసాగర సంగమం

భూమాతను ”సముద్ర వసనే దేవీ!” అం టూ స్తుతిస్తారు. అంటే సముద్ర ము మధ్యలో నివసించునది అని ఒక అర్థం కాగా, సముద్రాన్నే వస్త్రంగా ధరించేది అని మరొక అర్థం ఉంది. భూగోళంలో జలభాగం 71 శాతం ఆవరించి ఉంది. తన శరీరంలో 71 శాతం సముద్రమనే వస్త్రాన్ని ధరించిన భూదే వి మనకు, శరీరాన్ని నిండుగా వస్త్రాలతో కప్పు కోవాలని, అదే మనకు గౌరవాన్ని కలిగిస్తుంద ని, పరోక్ష సందేశాన్నిస్తోంది.
భూగోళమంతా 71 శాతం ఆవరించి ఉన్న జలభాగాన్ని ప్రధానంగా మన భౌగోళిక శాస్త్రవేత్తలు 5 మహా సముద్రాలుగా విభజించా రు. అవి పసిఫిక్‌, అట్లాంటిక్‌, ఆర్కిటిక్‌, అంటార్కిటిక్‌, హందూ మహాస ముద్రాలు. అయితే మన ప్రాచీన వాఙ్మయం ప్రపంచాన్ని ఏడు ద్వీపాలు గా, (జంబు, ప్లక్ష, కుశ, క్రౌంచ, శాక, శాల్మలి, పుష్కర ద్వీపాలు), ఆ ద్వీపా లను ఆవరించి ఏడు సముద్రాలు (లవణ, ఇక్షు, సుర, సర్పి, దధి, క్షీర, జలార్ణవములు) ఉన్నట్లుగా పేర్కొన్నది. మన పురాణాల ప్రకారం ఏడు స ముద్రాలూ వేర్వేరు ద్రవ పదార్థాలను కలిగి ఉన్నాయి. లవణ సముద్రం లో ఉప్పునీరు, ఇక్షు సముద్రంలో చెరకు పాలు, సురా సముద్రంలో కల్లు, సర్పి సముద్రంలో నెయ్యి , దధి సముద్రంలో పెరుగు, క్షీర సాగరంలో పా లు, జలార్ణవంలో మంచినీరు ఉన్నాయని పురాణ వచనము. వీటిని గురించి తెలుసుకొందాం.
మొదటిది లవణ సముద్రం. దీని పరిమాణం ఒక లక్ష యోజనాలు. ఇది జంబూద్వీపాన్ని చుట్టి ఉంది. ఇందులో ఉప్పు నీరుంటుంది. లవణ సముద్రానికి అవతల ప్లక్ష ద్వీపం ఉంటుంది.
రెండవది ఇక్షు సముద్రం. దీని పరిమాణం లవణ సముద్రానికి రెట్టింపు. అంటే రెండు లక్షల యోజనాలన్న మాట. ఇందులో చెరకు పా లు ఉంటాయట. దీనికి అవతల శాల్మలీ ద్వీపం ఉంటుంది.
మూడవది సురసాగరం. ఇది ఇక్షు సముద్రానికి రెండింతల పరిమా ణంలో, అంటే నాలుగు లక్షల యోజనాల పరిమాణం కల్గి ఉంటుంది. దీనిలో కల్లు ఉంటుంది. దీనికి ఆవల కుశద్వీపం ఉంటుంది.
నాల్గవది సర్పి లేదా ఘృత సముద్రము. ఇది సురసాగరానికి రెట్టిం పు అంటే ఎనిమిది లక్షల యోజనాల పరిమాణంలో ఉంటుంది. ఇందు లోని ద్రవ పదార్థం నెయ్యి. దీని తర్వాత క్రౌం చద్వీప ముంటుంది.
ఐదవది క్షీరసాగరం. ఇది ఘృతసాగరా నికి రెండింతలు అంటే పదహారు లక్షల యో జనాల పరిమాణం కలిగి ఉంటుంది. పురాణా లలో దీని ప్రస్తావన కన్పిస్తుంది. ఇందులో పా లు ఉంటాయి. ఈ పాల కడలిలో శేష తల్పము మీద విష్ణువు పవళించి ఉంటాడని, పాలస ముద్రం నుంచి లక్ష్మీదేవి జన్మించిం దని పురా ణ కథనం. అందుకే లక్ష్మీదేవిని ‘క్షీరో దార్ణవ సంభూత’ అని స్తుతిస్తూంటారు. పాలు పవిత్ర తకు, స్వచ్ఛతకు, ధర్మానికి ప్రతీక. ఆ గుణాలు ఉన్నచోటే సంపద ఉంటుందని దీని అంతరా ర్థం. ”పాల సంద్రమందు పవ్వళించిన హరి గొల్ల ఇండ్ల పాలు కోరనేల? ఎదుటివారి సొమ్ములెల్ల వారికి తీపి” అంటూ విశ్వకవి వేమన శ్రీ#హరిని నిందాస్తుతి చేశారు. పాలసముద్రానికి అవతల శాక ద్వీపం ఉంటుంది.
ఆరవది దధిసముద్రం. ఇది పాలకడలికి రెట్టింపుగా, అంటే, 32 లక్ష ల యోజనాల విస్తీర్ణంతో ఉంటుంది. ఇందులో పెరుగు ఉంటుంది. దీనికి ఆవల పుష్కర ద్వీపముంటుంది.
చివరిదీ, ఏడవది ఉదక సాగరం లేదా జలార్ణవం. దీని పరిమాణం దధి సముద్రానికి రెట్టింపు అంటే 64 లక్షల యోజనాలు. ఇందులో మంచినీరుంటుంది. దీనికి అవతల లోకాలోక పర్వతముంటుంది.
పురాణ కథనాన్ని బట్టి ”సప్తద్వీపా-వసుమతీ” లోకం 7 ద్వీపా లు(ఖండాలు)గా విభజింపబడిందనీ, అవి 7 సముద్రాలచేత వేరుచేయబ డి ఉన్నాయనీ, ఆ 7 సముద్రాలూ ఒకదానికంటే మరొకటి రెట్టింపు పరి మాణంలో ఉంటాయనీ, అన్నింటికీ చివర లోకాలోక పర్వతం అంటే (ఇ క ప్రపంచం లేదు) శూన్యమనబడే ఆకాశమే ఉంటుందనీ గ్రహంచవచ్చు.
స్వాయంభువ మనువు కుమారుడైన ప్రియవ్రతుడు సూర్యుని రథం తో సమానమైన వేగంతో ప్రయాణించే రథాన్ని అధిరో#హంచి ఒకనాడు సూర్యుని చుట్టూ ఏడు పర్యాయాలు ప్రదక్షిణలు చేశాడట. అమిత వేగం తో ప్రయాణించడం వలన రథచక్రాల గాడులు భూమిని ఒరుసుకొని సప్త సముద్రాలుగా ఏర్పడ్డాయనీ, వాటి మధ్య గల ఏడు భూభాగాలూ ఏడు ద్వీపాలనీ శ్రీమద్భాగవతంలోని పంచమ స్కంధం చెబుతోంది.
ఈ ఏడు ద్వీపాలలో మనం నివసిస్తు న్న జంబూద్వీపం, దానిని ఆవరించి ఉన్న లవణ సాగరం మాత్రమే మనకు ప్రత్యక్షంగా కనిపించేవి. మన భూగోళం లో ఉన్న లవణ సముద్రం మనకు లెక్కలేనంత సం పదనిస్తోంది. మత్స్యసంపదకు, అనేక రకాలైన ముత్యా లు, రత్నాలు వంటి విలువైన వస్తువులకు, ఉప్పుకు, పెట్రో ల్‌ వంటి ఖనిజాలకు సముద్రం పుట్టినిల్లు. ఖండాంతర యానా నికి, వస్తు రవాణాకు సముద్ర మార్గాలు ఉపయోగపడతాయి. వర్షాలను ప్రసాదించే జలచక్రానికి ప్రధాన వనరు ఈ సముద్రమే. తన కు ఎన్ని సంపదలున్నా అహంకరించకుండా, తన #హద్దులను ఎన్న డూ అతిక్రమించకుండా, గంభీరంగా ప్రవర్తించాలని సముద్రం మానవాళికి సందేశం ఇస్తుంది. సృష్టిలో అత్యంత రుచికరము లైన చెరకురసం, పాలు, పెరుగు, నెయ్యి, కల్లు, మంచినీరు కలిగిన సముద్రాలు ఒకవేళ మనకు అందుబాటులో ఉండి ఉంటే ఇప్పటికే దోపిడీకి గురయి ఉండేవి. కనీ సం మంచినీటి సముద్రం చిరునామా తెలిసినా స్వార్థపరులైన మానవులు దాన్ని కబ్జా చేయ కుండా ఆగే వాళ్ళు కాదు. అవి ఎక్కడో ఉ న్నాయన్న ఊహ ఎంతో ఉల్లాసాన్ని స్తోంది. అహంస, సత్యం, అపరిగ్ర #హం వంటి సద్గుణాలనే మధుర పదార్థాలను మన మనస్సు అనే సముద్రంలో నింపు కొంటే జీవితం సప్త సా గర సంగమమే !

Advertisement

తాజా వార్తలు

Advertisement