Friday, June 14, 2024

Supreme Court | ప్రతి పోలీస్ స్టేషన్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని.. ఆదేశాలు జారీ

సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ఎన్ని మాటలు చెప్పినా సామాన్యులు మాత్రం పోలీస్ స్టేషన్లలో దారుణమైన అనుభవాలను ఎదుర్కొంటున్నారు. అధికారం ఉన్నవారిపై, డబ్బున్న వారిపై పోలీసులు కొమ్ముకాస్తూ, సామాన్యులపై ఉక్కుపాదం మోపుతున్నారనే ఆరోపణలు మాత్రం వీడటం లేదు. కొన్ని పీఎస్ లు సెటిల్మెంట్లకు అడ్డాగా మారుతున్నాయి. లాకప్ డెత్, బెదిరింపులు, బలవంతపు వసూళ్లు, అక్రమార్కులకు మద్దతివ్వడం వంటి ఆరోపణల వల్ల వ్యవస్థపై నమ్మకం పోయింది. కొన్ని స్టేషన్లలో చెప్పలేనంత దారుణాలు కూడా జరుగుతున్నాయి.

ఇలా పీఎస్‌లలో జరిగే ప్రతి ఒక్కటీ పారదర్శకంగా ఉండాలని, తద్వారా సామాన్యులకు న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతో పీఎస్‌ల విషయంలో సుప్రీంకోర్టు ఈ నిర్ణ‌యం తీసుకుంది. అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయా రాష్ట్రాల సీఎస్ లకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాలని ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement