Tuesday, May 7, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 17, శ్లోకం 9
9.
కట్వవ్లులవణాత్యుష్ణ –
తీక్షరూక్షవిదాహిన: |
ఆహారా రాజసస్యేష్టా
దు:ఖశోకామయప్రదా: ||

తాత్పర్యము : మిక్కిలి చేదైనవి, అతి పులుపైనవి, ఉప్పుగ నున్నటివి, అతి వేడివి, అతి కారమైనవి, ఎండినట్టివి, మంటను కలిగించనవి యైన ఆహారములు రజోగుణమునందున్నవారికి ప్రియమైనట్టివి. అట్టి ఆహారములు దు:ఖమును, క్లేశమును, రోగమును కలిగించును.

భాష్యము : రజోగుణములో ఉండు ఆహారములు చేదుగాను, మరింత ఉప్పగాను లేదా ఎక్కువ కారముగాను అనగా ఎండు మిరపకాయలను ఎక్కువగా వాడుటచే అవి కడుపులోని ద్రవపదార్థములను తగ్గించి వేసి అనారోగ్యమునకు కారణమగును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement