Thursday, April 25, 2024

వింబుల్డన్: మూడో రౌండ్ కు దూసుకెళ్లిన ఫెదరర్

స్విస్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ వింబుల్డన్ మూడవ రౌండ్ లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఫ్రాన్స్ కు చెందిన రిచర్డ్ గ్యాస్కట్ తో తలపడి గెలిచాడు. మూడు వరుస సెట్లలో 7-6(1), 6-1, 6-4 తేడాతో ఫెదరర్ గెలవడం గమనార్హం. మరో మ్యాచ్ లో రెండో సీడ్ మెద్వదేవ్, స్పెయిన్ కు చెందిన అల్కర్జ్ గార్ఫియాపై పోటీ పడి, 6-4, 6-1, 6-2 తేడాతో గెలిచాడు. మహిళల సింగిల్స్ విషయానికి వస్తే, ఇప్పటికే పలువురు టాప్ సీడ్స్ వైదొలగగా, మూడో సీడ్ గా బరిలోకి దిగిన స్వితోలినా కూడా అదే దారిలో నడిచింది. పోలెండ్ కు చెందిన మగ్దా లిన్నెట్టితో పోటీ పడిన ఆమె 3-6, 4-6 తేడాతో ఓటమి పాలైంది. బ్లింకోవాపై బార్టీ 6-4, 6-3 తేడాతో గెలువగా, 8వ సీడ్ కరోలినా ప్లిస్కోవా 6-2, 6-2 తేడాతో డోనా వికిక్ పై విజయం సాధించింది.

ఇది కూడా చదవండి: టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ కొట్టేసిన స్ప్రింటర్‌ ద్యూతీ చంద్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement