Friday, May 3, 2024

పెరిగిన క్రూడాయిల్ ధర..!

ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ లకు డిమాండ్ పెరగడంతో క్రూడాయిల్ ధరలు మరో 2 శాతం మేరకు పెరిగాయి. గురువారం నాడు బ్రెంట్ క్రూడాయిల్ ధర 1.22 డాలర్లు (1.6 శాతం) పెరిగి 75.84 డాలర్లకు చేరుకోగా, యూఎస్ వెస్ట్ టెక్సాస్ క్రూడాయిల్ ధర 2.4 శాతం పెరిగి బ్యారల్ కు 75.23 డాలర్లకు చేరుకుంది. 2018 అక్టోబర్ తరువాత క్రూడాయిల్ ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. దీంతో పలు దేశాల్లో పెట్రోలు ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తాజాగా జరిగిన ఒపెక్ సభ్య దేశాల సమావేశంలో ఉత్పత్తిని పెంచాలని తీసుకున్న నిర్ణయాన్ని కొన్ని దేశాలు వ్యతిరేకించడం కూడా ధర పెరుగుదలకు కారణమని నిపుణులు వ్యాఖ్యానించారు. ఆగస్టు నుంచి రోజుకు 20 లక్షల బ్యారల్ల ఉత్పత్తిని పెంచాలని ఒపెక్ నిర్ణయించగా, సభ్య దేశాల్లో కీలకమైన యూఏఈ దాన్ని వ్యతిరేకించింది. యూఏఈ వ్యతిరేకించడంతో ఒపెక్ సమావేశం కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే వాయిదా పడగా, ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసింది. దీంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి.

ఇది కూడా చదవండి: కృష్ణాజలాల దోపిడికి కేసీఆరే కారణం.. వైయస్ పాత్ర లేదన్న రేవంత్

Advertisement

తాజా వార్తలు

Advertisement