Saturday, April 27, 2024

ఆచమనం అంటే ఏమిటి

ఆ చమనం అంటే సర్వలోకాలకు అధిపతి అయి సర్వత్రా వ్యాపించిన విష్ణుమూర్తి పవిత్ర నామాల ఉచ్చరణ. ఆచమనం ఎలా చేయాలి..? చిన్న రాగి గ్లాసు, చిన్న రాగి ప్లేటు-, చిన్న రాగి చెంచా (ఉద్ధ రిణి) ఈ సెట్‌ను పంచపాత్ర అంటు-ంటారు. దీనిలో పవిత్రమైన అంటే అప్పుడే బావులు, బోర్లు లేదా మంచినీటి పంపుల్లో పట్టు-కు వచ్చిన నీరు తీసు కోవాలి. ఈ నీటిని ఉద్ధరిణితో (ఎడమచేతితో) కుడిచేతిలో పోసుకోవాలి. దీనికోసం కుడిచేతిలో బొటనవేలు, చూపుడు వేలు మూసివేయాలి. అప్పుడు మిగిలిన మూడు వేళ్లు చాపి ఉంటాయి. ఆ విధంగా చేతిని పెట్టినప్పుడు ఏర్పడే చిన్న ప్రదేశంలోకి గురువింద గింజ అంత నీటిని మొదటిసారి ‘కేశవయ స్వాహా’ అని, రెండోసారి ‘నారా యణాయ స్వాహా’ అని, మూడోసారి ‘మాధవాయ స్వాహా’ అని తీసుకోవాలి. నీటిని నోటిలోకి తీసుకునే సమయంలో చప్పుడు రాకుండా తీసుకోవాలి. తర్వాత నాల్గోసారి ‘గోవిందా యనమ:’ అని చేతిని ఒక చుక్కు నీటితో కడుగుకోవాలి. తర్వాత కింది నామాలను అయ్యగారు చదువుతారు. మీరు నేర్చుకుని చదువుకోవచ్చు. అవి… ”కేశవ, నారాయణ, మాధవ, గోవిందా! విష్ణు, మధు సూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషీ కేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యు మ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, అధోక్షజ, నారసింహ, అచ్యుత, జనార్థన, ఉపేంద్ర, హరి, శ్రీకృష్ణా యనమ:” అని చదువుకోవాలి. తర్వాత ప్రాణాయామం చేసి సంకల్పం చెప్పుకుని, తర్వాత పూజ ప్రారంభం అవుతుంది.
ఒక్కో నామానికి ఒక్కో విశేషం ఉంది. వాటికి అర్థం, పరమార్థం ఉన్నా యి. మూడు నామాలు చదువుతూ ఆచమనీయం చేయడంలో పరమార్థం, ముఖ్యోద్దేశం ఏమిటంటే మనిషి తమో, రజో, సత్వగుణాలను వదిలి శుద్ధంగా మారడం. అంతే కాకుండా త్రికరణాలను అంటే ”మనస్సు, వాక్కు, కర్మ లను శుద్ధంగా భగవంతుడికే అర్పిస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నాను” అని చెప్పడమని కొందరు పండితులు అర్థం చెబుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement