Thursday, March 28, 2024

మతమార్పిడులకు బ్రేకే

విశాఖపట్నం, ప్రభన్యూస్‌బ్యూరో: విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఢిల్లీలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మురళీ ధర్‌ను మంగళవారం ఆయన నివాసం లో కలిసారు. ఈ సందర్భంగా పలు ధార్మి క అంశాలపై వీరు చర్చించారు. ప్రధా నమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయాలతో దేశంలో అన్యమత ప్రచారం, మత మా ర్పిడులు నియంత్రణలోకి వస్తున్నాయని స్వాత్మానందేంద్ర కొనియాడారు. స్వ చ్ఛంద సంస్థల ముసుగులో కొన్ని సంస్థ లు విదేశాల నుంచి మిషనరీ నిధులు తీసుకొచ్చి నిరుపేద వర్గాలను లక్ష్యంగా చేసుకుని ప్రలోభాలకు గురి చేస్తున్నాయని స్వామీజీ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. విదేశాల నుండి వచ్చే నిధులపై ఆంక్షలు విధించడం ద్వారా మోడీ ప్రభుత్వం హిందూ ధర్మానికి మేలు చేసిం దని ప్రశంసించారు. తెలుగు రాష్ట్రాల్లో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతు లు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి ధర్మ పరిరక్షణకు చేపడుతు న్న కృషిని, తాను చేపట్టిన హిందూ ధర్మ ప్రచార యాత్ర గురించి కేంద్రమంత్రికి వివరించారు. దళితులు, గిరిజనులతో కలిసి తిరుమ లకు వెళ్ళినట్లు- తెలిపారు. అక్షరాస్యత ఎక్కువగా ఉన్న కేరళ రాష్ట్రం లో విదేశీ మతాల ప్రభావం అధికంగా ఉందని ఈ సంద ర్భంగా స్వామీజీ వద్ద కేంద్రమంత్రి మురళీధర్‌ ఆందోళన వ్యక్తం చేసారు.
కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌కు ఆశీర్వాదం
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ను మంగళవారం కలిసారు. గ్రామీణ ప్రాంతాల్లో హిందూ ధర్మ పరిరక్ష ణకు సంబంధించిన అంశాలపై వీరు చర్చించారు. ఆలయాలను కేంద్రంగా చేసుకుని ధర్మ ప్రచారం చేయాల్సిన అవసరాన్ని కేంద్రమంత్రికి స్వామీజీ వివరించారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్ల్రో అన్యమతాల ప్రభావం అధికంగా ఉందని ఈ సందర్భంగా గిరిరాజ్‌ సింగ్‌ చెప్పారు. పీఠాధిపతులు, మఠాధిపతులు ఏకమై హిందూ ధర్మాన్ని పటిష్టం చేయాలని కోరారు.రాబోయే 20 సంవత్సరాలు కీలకమైనవిగా పరిగణించి కృషి చేయాలని, యువతరాన్ని లక్ష్యంగా చేసుకుని ధర్మ ప్రచారం సాగించాలని, దేశవ్యాప్త ధార్మిక సమ్మేళనం నిర్వహించాలని కేంద్రమంత్రి అభిప్రాయ పడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement