Thursday, May 16, 2024

అన్నమయ్య సంకీర్తనలు

రాగం : బహుదారి
సకలశాంతి కరము

సకలశాంతి కరము సర్వేశ నీపై భక్తి సర్వేశ |
ప్రకటమై మాకు నబ్బె బతికించు నిదియె సర్వేశ || సకలశాంతి కరము ||

మనసులో పాపబుద్ధి మరియెంత దలచిన
నినుదలచినంతనే నీ ఱౌను
కనుగొన్న పాపములు కడలేనివైనాను
ఘనుడ నిన్ను జూచితే కడకు తొలగును || సకలశాంతి కరము ||

చేతనంటి పాతకాలు సేనగానె చేసినాను
ఆతల నీకు మ్రొక్కితే నన్నియు బాయు
ఘాతలచెవుల వినగా నంటిన పాపము
నీతితో నీకథవింటే నిమిషాన బాయును || సకలశాంతి కరము ||

కాయమున చేసేటి కర్మపు పాపములెల్ల
కాయపు నీ ముద్రలచే గ్రక్కున వీడు
యేయెడ వేంకటేశ యేయే పాతకమైన
ఆయమైన నీ శరణాగతిచే నణగు || సకలశాంతి కరము ||

Advertisement

తాజా వార్తలు

Advertisement