Tuesday, May 7, 2024

అక్టోబర్‌ 7 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

15 వరకు ఏకాంతంగా నిర్వహణ

తిరుమల, ప్రభన్యూస్‌: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అక్టోబర్‌ 7 నుంచి 15వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ బోర్డు నిర్ణయించిందని ఈవో డాక్టర్‌ ఎస్‌.జవహర్‌రెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈవో సమీక్ష నిర్వహించారు. ఈవో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల పలు జిల్లాలో టీటీడీ ఆలయాలు నిర్మించిందని, ఆయా జిల్లాల నుంచి వెనుకబడిన ప్రాంతాలకు చెందిన 500 నుంచి 1000 మంది భక్తులను బస్సులో ఉచితంగా తిరుమలకు తీసుకువచ్చి స్వామి వారి దర్శనం చేయించేందుకు విధివిధానాలు ఖరారు చేయాలని హెచ్‌డీపీపీ రవాణా విభాగం అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వేద పారాయణంలో అర్హులైన వారికి పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేయాలని అధికారులకు సూచించారు. బ్రహ్మోత్సవాలలో ఎస్‌వీబీసీ కన్నడ, హిందీ ఛానళ్లు ప్రారంభించేం దుకు సీఈవో ఏర్పాట్లు చేపట్టాలన్నారు. బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల వైశిష్ట్యంపై వసంత మండపంలో ప్రముఖ పండితుల చేత ఉపన్యాస కార్యక్రమాలు ఏరాటు చేయా లన్నారు. నాదనీరాజనం వేదికపై టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో అన్నమ య్య సంకీర్తనలు, ఇతర వినూత్న కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. అలిపిరి కాలినడక మార్గాన్ని బ్రహ్మోత్సవాల లోపు భక్తులకు అందుబాటులోకి తీసుకురా వాలన్నారు. విశ్రాంతి గదులలో మాస్‌ క్లీనింగ్‌ చేపట్టాలని, మరమ్ము తులు పూర్తయిన కాటేజీలను భక్తులకు కేటాయించేందుకు సిద్ధంగా ఉంచు కోవాలని సూచించారు. శ్రీవారి ఆలయం, అన్ని కూడళ్లు, ఇతర ముఖ్యమైన ప్రాం తాల్లో శోభాయ మానం గా విద్యుత్‌ అలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టాలని ఆదేశించారు. అన్నప్రసాద భవనంలో ఉదయం 8 నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు అన్న ప్రసాదాలు అందించాలని డిప్యూటీ ఈవోను ఆదేశించారు. భకు ్తలకు సేవలందిం చేందుకు పరిమిత సంఖ్యలో శ్రీవారి సేకులను ఆహ్వానించాల న్నారు. అంతకుముం దు టీటీడీ అదనపు ఈవో ఏవీ.ధర్మారెడ్డి మాట్లాడుతూ అక్టోబర్‌ 5న కోయిల్‌ ఆళ్వా ర్‌ తిరుమంజనం, 6న అంకురార్పణ జరుగుతాయని తెలిపారు. 12న స్వర్ణరథం, 14న రథోత్సవం, 15న చక్రస్నాన్న ధ్వజారోహణం జరుగుతాయని తెలియజేశా రు. ఈ సమావేశంలో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చ కులు వేణుగోపాల దీక్షితులు, కృష్ణ శేషాచల దీక్షితులు, గోవిందరాజ దీక్షితులు, టీటీడీ జేఈవో సదాభార్గవి, అదనపు ఎస్పీ మునిరామయ్య, అదనపు సీవీఎస్‌ఓ శివకుమార్‌రెడ్డి, ఎఫ్‌ఏసీ ఏవో బాలాజి, చీఫ్‌ ఇంజనీర్‌ నాగేశ్వరరావు, ఆలయ డిప్యూటీ ఈవో రమేష్‌బాబు, హెచ్‌డీపీపీ ప్రోగ్రామింగ్‌ అధికారి విజయసారథి, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ శ్రీదేవి, ఇతర అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement