Sunday, May 5, 2024

బిగ్ బాస్5 @జాంబిరెడ్డి నటి

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికే నాలుగు సీజన్ లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 5 వ సీజన్ కు రెడీ అవుతోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ప్రస్తుతం నిర్వాహకులు ప్రోమో షూట్ ను చేసే పనిలో బిజీగా ఉన్నారు. కాగా ఇప్పటికే ఈసారి షోలో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్ లు వీరే అంటూ కొన్ని పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం ఎక్కడా రాలేదు.

కాగా తాజాగా జాంబి రెడ్డి చిత్రంలో నటించిన లహరి శారి ఈ సారి హౌస్ లో అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే అక్కినేని నాగార్జునే ఈ సారి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక బుల్లితెర ప్రేక్షకులు అలాగే బిగ్ బాస్ అభిమానులు ఈ షో ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement