Sunday, April 28, 2024

నీకు ప‌ని చెయ్య‌డంపైనే అధికారం ఉంది..ఫ‌లితం మీద లేదు.. స‌మంత‌

ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కించిన చిత్రం శాకుంత‌లం.ఈ చిత్రం ప‌రాజ‌యం పాల‌యింది. ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషించిన స్టార్ హీరోయిన్ స‌మంత‌ని నెటిజన్లు నెగెటివ్‌ కామెంట్స్ తో ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. దాంతో భగవద్గీతలోని శ్లోకాన్ని షేర్ చేస్తూ.. చెక్ పెట్టింది స్టార్ హీరోయిన్ స‌మంత‌. నీకు పని చెయ్యడం మీదే అధికారం ఉంది. దాని ఫలితం మీద మాత్రం లేదు. ఫలితానికి నువ్వు కారణం కాకూడదు.అలాగే పని చెయ్యడం మానకూడదు. ప్రతిఫలం ఆశించకుండా పనులు చెయ్యి.. అని శ్లోకం అర్థాన్ని గుర్తుచేస్తూ.. శాకుంతలం ఫలితాన్ని ఉద్దేశించి పెట్టిన ఈ పోస్ట్‌ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మొత్తానికి కష్టపడి సినిమా చేయడం వరకే తన బాధ్యత. దాని ఫలితం ఎలా ఉన్నా.. తర్వాత చేయబోయే పనిఫై ఫోకస్‌ పెట్టడం ముఖ్యమని క్లారిటీ ఇచ్చేసింది సమంత.

Advertisement

తాజా వార్తలు

Advertisement