Wednesday, May 8, 2024

రెండో పెళ్లి చేసుకున్న.. న‌టి మ‌హి గిల్

సినిమా తార‌లు ప్ర‌తి విష‌యాన్ని గోప్యంగా ఉంచుతుంటారు. కాగా ద‌ బాలీవుడ్ నటి మహి గిల్ రహస్యంగా వివాహం చేసుకున్న విష‌యాన్ని దాచిపెట్టింది.అయితే ఆమె తాజాగా ఒక మీడియా సంస్థకు సమాచారం ఇవ్వడం ద్వారా బయటకు వచ్చింది. ఈమె ప్రముఖ బిజినెస్ మాన్ రవికేసర్ ను సీక్రెట్ గా పెళ్లాడింది. అయితే ఎక్కడా కూడా వీరిద్దరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు లేదా వీడియోలు బయటకు రాకపోవడం గమనార్హం. చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని తెలియకుండా ఉండకుండా ప్లాన్ చేసుకున్నారు. వీరికి గత నాలుగు సంవత్సరాల నుండి పరిచయం ఉన్నట్లుగా తెలుస్తోంది. 2019 లో ఫిక్సర్ అనే ఒక వెబ్ సిరీస్ లో వీరు కలిసి నటించారు. అయితే మహి గిల్ కు ఇది రెండవ వివాహం కావడం మరో షాక్. కాగా అయిదు సంవత్సరాల పాప కూడా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement