Sunday, April 28, 2024

ఏజెంట్ సాంగ్.. అందాలు ఆర‌బోసిన ఊర్వ‌శి రౌతెల్లా

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రం ఏజెంట్. సురేంద‌ర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. ఏజెంట్‌ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతోపాటు వివిధ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.ఈ చిత్రంలో హీరోగా అఖిల్ న‌టిస్తున్నారు.ఏజెంట్‌తో మోడల్‌ సాక్షి వైద్య తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్‌గా మెరవబోతుంది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సురేందర్‌ 2 సినిమా బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ముర‌ళీ శ‌ర్మ‌, పోసాని కృష్ణమురళి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏజెంట్‌ చిత్రానికి వక్కంతం వంశీ కథనందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి వైల్డ్‌ సాలా వీడియో సాంగ్ లాంఛ్ చేశారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా అందాల ఆరబోతతో హాట్‌గా, స్టైలిష్‌గా సాగుతున్న ఈ పాట సినిమాకు హైలెట్‌గా నిలవబోతున్నట్టు వీడియో సాంగ్‌తో అర్థమవుతోంది. రఘురాం రాసిన ఈ పాటను భీమ్స్‌ సిసిరోలియో కంపోజిషన్‌లో శ్రావణ భార్గవి, భీమ్స్‌ సిసిరోలియో, స్వాతి రెడ్డి, అమల చెంబోలు పాడారు. ఈ చిత్రంలో మ‌ల‌యాళ‌ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement