Tuesday, May 21, 2024

కండోమ్ టెస్టర్ గా రకుల్ ?

మొన్నటి వరకు రకుల్ ప్రీత్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. వరుస సినిమాలను చేస్తూ మంచి జోష్ మీద ఉండేది. అయితే ఇటీవల కాలంలో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గిపోయాయి. ఒకటి రెండు సినిమాలు మినహా.. స్టార్ హీరోల సినిమాలు ఏవి కూడా ఈ అమ్మడి చేతిలో లేవు. కాగా ఇప్పుడు ఈ అమ్మడు ఓ సరికొత్త ప్రయోగానికి సిద్దమవుతుంది. ఓవైపు రెగ్యులర్, కమర్షియల్ చిత్రాలు చేస్తూనే ఈ ప్రయోగానికి రెడీ అయింది.

ప్రఖ్యాత నిర్మాత రోనీ స్క్రూవాలా నిర్మించే ఈ చిత్రంలో రకుల్ కండోమ్ టెస్టర్ పాత్రలో కనిపించనుంది. అంతేకాకుండా ఈ సినిమాలో సామాజిక సందేశం కూడా ఉంటుందట. కాగా ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ని మాత్రం నిర్ణయించలేదు. ఇక మరోవైపు రకుల్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు బాలీవుడ్ లో కొన్ని సినిమాలు కూడా చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement