Friday, May 10, 2024

ఎపిలో బెడ్స్ కోసం ప‌డిగాపులే…..

అత్యవసరమైనా అంతే సంగతులు
అంబులెన్స్‌లోనే చికిత్సలు
పెరిగిపోతున్న కరోనా కేసులు
ప్రమాదస్థాయికి సెకండ్‌ వేవ్‌

అమరావతి, : అత్యంత ప్రమాదకరం వైపు పయనిస్తున్న కరోనా సెకండ్‌ వేవ్‌కు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్నీ ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేస్తున్నప్పటికీ మరోవైపు క్షేత్రస్థాయిలో కరోనా బాధితులకు పడిగాపులు తప్పడం లేదు. పెరుగు తున్న కేసులకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌ వైద్యశాలల్లో బెడ్ల సంఖ్య పెంచుతున్నా రోజురోజుకు అమాంతంగా పెరుగుతున్న కరోనా కేసులతో బాధితులు బెడ్ల కోసం యుద్దం చేయాల్సి వస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలోని ఆయా ప్రధాన వైద్యశాలలతో పాటు ప్రభుత్వం కోవిడ్‌ వైద్యశాలలుగా గుర్తించిన ప్రముఖ కార్పొరేట్‌ వైద్యశాలల్లో కూడా బాధితు లకు అవసరమైన బెడ్లు అందుబాటులో ఉండడం లేదు. కొన్ని వైద్యశాలల్లో అయితే బెడ్ల కోసం కరోనా బాధితులు ఉదయం నుంచి రాత్రి వరకు ఎదురుచూడాల్సి వస్తోంది. అంతసేపు క్యూ లైన్ల లో నిరీక్షించినా చివరకు నో బెడ్‌ అనే సమాధానమే వినిపిస్తోంది. దీంతో కొన్ని అత్యవసర సందర్భాల్లో కొంతమంది బాధితులు అంబులెన్స్‌లోనే ఆక్సిజన్‌ తీసుకుని ప్రాణాలు కాపాడుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో అంబులెన్స్‌లో కూడా ఆక్సిజన్‌ అందుబాటులో లేకపోతే కుటుంబసభ్యుల కళ్లెదుటే కరోనా బాధితులు ప్రాణాలొదులుతున్నారు. ఆదివారం ఒక్కరోజే రాష్ట్రంలో 69 మంది ప్రాణాలు కోల్పోయారంటే.. కరోనా సెకండ్‌ వేవ్‌ ఎంత ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తుందో అర్థమవుతోంది. ఇదేక్రమంలో రికవరీ శాతం పెరుగుతున్నప్పటికీ.. కొత్త కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోతోంది. ఫలితంగా యాక్టివ్‌ కేసులు లక్షకు చేరువలోకి రాబోతున్నాయి. రానున్న వారం రోజుల్లో ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో పరిస్థి తి మరింత ప్రమాదకరంగా మారబోతోందని స్పష్ట ంగా అర్థమవుతోంది.
అత్యవసరమైనా.. ఇవ్వలేని పరిస్థి తి
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 13 జిల్లాల పరిధిలో 12634 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 1680 కేసులు వచ్చాయి. 7 జిల్లాలలో 1000 మార్కు దాటగా.. 3 జిల్లాలలో 1500 మార్కు దాటింది. ఇదే సందర్భంలో వివిధ ఆసుపత్రుల్లో కోవిడ్‌ చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య కూడా 89732కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో 4304 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే యాక్టివ్‌ కేసులతో పోలిస్తే రికవరీ శాతం చాలా తక్కువగా ఉంది. అయితే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో రికవరీ శాతం ఎక్కువగాను, యాక్టివ్‌ కేసుల సంఖ్య తక్కువగాను ఉన్నప్పటికీ గడిచిన పది రోజుల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ వస్తున్నాయి. దీంతో ఆయా జిల్లా కేంద్రాల్లోని ప్రధాన వైద్యశాలల్లో కూడా అత్యవసర బాధితులకు బెడ్‌ ఇవ్వలేని పరిస్థి తులు ఎదురవుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే వందల సంఖ్యలో బాధితులు బెడ్ల కోసం వైద్యశాలల ఎదుట పడిగాపులు కాయాల్సి వస్తోంది. అంతసేపు వేచి ఉన్నా నమోదైన కొత్త కేసులకు అవసరమైన బెడ్లు ఇవ్వలేని పరిస్థి తి దర్శనమిస్తోంది. అయితే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు కోవిడ్‌పై సమీక్షలు నిర్వహించి బాధితులకు మూడు గంటల్లోపు బెడ్లు కేటాయించాలని స్పష్ట మైన ఆదేశాలు జారీ చేశారు. అందుకు అవసరమైన బెడ్లను సిద్దం చేసుకోవాలని సంబంధిత అధికారులకు పదేపదే సూచిస్తూ వస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు తగినన్ని బెడ్లు అందుబాటులో ఉండడం లేదు. దీంతో కోవిడ్‌ బాధితులకు వైరస్‌ సోకిందనే భయం కంటే బెడ్లు దొరుకుతాయో లేదోనన్న బెంగ ఎక్కువైంది.
అంబులెన్స్‌లోనే చికిత్సలు
సెకండ్‌ వేవ్‌లో కరోనా సోకిన కొంతమంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. వారిలో కొంతమంది ఆరోగ్యం విషమిస్తుండడం, అత్యవసరంగా వారికి ఆక్సిజన్‌ అందించాల్సిన పరిస్థి తులు ఎదురవుతున్నాయి. దీంతో కుటుంబసభ్యులు అంబులెన్స్‌లో బాధితులను కోవిడ్‌ వైద్యశాలలకు తీసుకొస్తున్నారు. ఊపిరాడక ప్రాణాపాయ స్థి తిలో కొట్టుమిట్టాడుతున్న బాధితుడిని అంబులెన్స్‌లో అతికష్ట ం మీద వైద్యశాలకు తీసుకొచ్చినా అక్కడ చేర్చేందుకు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. పేరు రిజిస్ట్రే షన్‌ దగ్గర నుండి అడ్మిషన్‌ అనుమతి లభించాలంటేనే 6 నుంచి 8 గంటలు ఎదురుచూడాల్సి వస్తోంది. దీంతో ఈలోపు ఎక్కడ ప్రాణాలు గాల్లో కలుస్తాయోనని అంబులెన్స్‌కు అధికంగా అమౌంట్‌ చెల్లించి బెడ్‌ దొరికే వరకు అంబులెన్స్‌లోనే ఆక్సిజన్‌ను అందించాల్సిన ప్రమాదకరమైన పరిస్థి తులు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో బెడ్లు దొరకక అంబులెన్స్‌లోనే రోజంతా వైద్యశాలల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement