Friday, April 26, 2024

ఐదుగురు హీరోయిన్స్ తో విశ్వక్ సేన్?

ఏఎల్ విజయ్ కుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చివరి దశకు చేరుకోగా… కరోనా కారణంగా షూటింగ్ నిలిపివేశారు. అయితే ఈ కరోనా పరిస్థితిలో సద్దుమణిగాక మిగిలిన షూటింగ్ ని కూడా కంప్లీట్ చేయబోతున్నారు.

అయితే ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. నివేద పేతురాజ్ ,మేఘా ఆకాశ్, మంజిమా మోహన్, రెబ్బ జాన్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా కనిపించనున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్ గా మరొక స్టార్ హీరోయిన్ నటించబోతున్నారట. ఆ హీరోయిన్ పేరు త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత రాజశేఖర్ రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement