Monday, May 6, 2024

పవన్ కళ్యాణ్ కోసం విజయేంద్ర ప్రసాద్ కథ ? ఇదే నిజం !!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన నటించిన వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది. అలాగే హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. వీటి తర్వాత గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు పవన్ కళ్యాణ్. అయితే తాజాగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పిన ఓ కథను పవన్ కళ్యాణ్ ఓకే చేశారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇదే విషయంపై విజయేంద్రప్రసాద్ స్పందించారు.

పవన్ కళ్యాణ్ కు కథ రాసేందుకు తాను ఎంతగానో ఎదురుచూస్తున్నానని… కానీ కథ కావాలని ఎవరూ తనని అడగలేదని చెప్పుకొచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ విజయేంద్ర ప్రసాద్ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది అనే వార్తలకు చెక్ పడింది. కాగా విజయేంద్రప్రసాద్ కోరినట్లు ఆ సమయం ఎప్పుడు వస్తుందా అని పవన్ అభిమానులు సైతం ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement