Saturday, May 4, 2024

కాజల్ గర్భవతి ?స్పందించిన కుటుంబ సభ్యులు

సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. లక్ష్మీకళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది కాజల్. అయితే కాజల్ గత ఏడాది తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ను వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత కూడా సినిమాలను చేస్తున్నారు కాజల్. కాగా ఇటీవల సోషల్ మీడియాలో కాజల్ గర్భవతి అంటూ కొన్ని వార్తలు వచ్చాయి.

అయితే ఇదే విషయం పై కాజల్ కుటుంబ సభ్యులు స్పందించారు. కాజల్ అగర్వాల్ గర్భం దాల్చింది అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని… క్లారిటీ ఇచ్చారు. అలాగే కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు మరికొన్ని చిత్రాల్లో కూడా కాజల్ నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement