Thursday, May 2, 2024

వీడియో వైరల్: వేగంగా వెళ్తున్న కారుపై పిడుగు

పిడుగు శబ్దం వింటేనే శరీరంలో వణుకు పుడుతుంది. అలాంటి పిడుగును లైవ్‌లో చూశామంటే చెమ‌ట‌లు ప‌ట్టాల్సిందే. అమెరికాలోని కాన్స‌స్‌లో వేగంగా ప్ర‌యాణిస్తున్న ఓ కారుపై పిడుగు ప‌డింది. కానీ ఆ కారులో ఉన్న ఐదుగురు మాత్రం క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఇద్ద‌రు దంప‌తులు, ముగ్గురు పిల్ల‌లు క‌లిసి కారులో ప్ర‌యాణిస్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. పిడుగు శబ్దానికి ఆ ఐదుగురు వ‌ణికిపోయారు. ముగ్గురు పిల్ల‌లు మూడేళ్ల వ‌య‌సులోపు ఉన్న‌వారే. ఎలాంటి ప్రాణ‌పాయం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘ‌ట‌న జూన్ 25న చోటు చేసుకోగా.. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఈ వీడియో వైర‌ల్ అవుతోంది. ఆ కారు వెనుకాలే ప్ర‌యాణిస్తున్న ఓ వ్య‌క్తి పిడుగును చిత్రీక‌రించి వైర‌ల్ చేశాడు.

YouTube video

ఈ వార్త కూడా చదవండి: ఆదర్శంగా నిలుస్తున్న యువ రైతు

Advertisement

తాజా వార్తలు

Advertisement