Monday, April 29, 2024

ప్రకాశం బ్యారేజీ 20 గేట్లు ఎత్తివేత.. 8,340 క్యూసెక్కుల నీరు సముద్రం పాలు

ఎగువ ప్రాంతాల్లో వర్షాల కారణంగా కృష్ణా నదిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో తెలంగాణ జెన్‌కో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని దిగువకు విడుదల చేస్తోంది. ఈ మేరకు విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. మొత్తం 20 గేట్ల ద్వారా 8,340 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీలో ప్రస్తుతం 3.07 టీఎంసీల నీటి నిల్వ ఉంది. దీంతో అదనపు నీటిని నిల్వ చేయలేని పరిస్థితిలో నీటి ప్రవాహాన్ని సముద్రంలోకి విడిచిపెడుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఎగువ ప్రాంతాల నుంచి పులిచింతల ప్రాజెక్ట్‌కు 39,700 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. తెలంగాణ జెన్‌కో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 7,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తోంది. మరోవైపు నాగార్జున సాగర్‌ రిజర్వాయర్ నుంచి 62,446 క్యూసెక్కులు, శ్రీశైలం నుంచి 21,229 క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతాలకు విడుదల అవుతోంది.

ఈ వార్త కూడా చదవండి: శ్రీశైలం జలాశయానికి తగ్గిపోయిన వరద

Advertisement

తాజా వార్తలు

Advertisement