Thursday, May 16, 2024

వెంకీ సైంధ‌వ షూటింగ్ ఫినిష్..

విక్టరీ వెంకటేష్‌ నటిస్తున్న 75వ సినిమా ‘ సెంధవ్‌’. శైలేష్‌ కొలను దర్శకుడు. వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరిగింది. తాజాగా హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్‌ పూర్తిచేసుకుంది. ఓ పాట చిత్రీకరణ కోసం భారీ సెట్‌ వేయగా, ఇందులోనే ప్రధాన తారాగణం పాల్గొనగా సన్నివేశాలు, ఫైట్‌ కూడా చిత్రీకరించారు. వెంకటేష్‌ కెరీర్‌లో ఇది భారీ బడ్జెట్‌ చిత్రం అవుతుంది. బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖి ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇతర వివరాలను త్వరలో వెల్లడిస్తారు. డిసెంబర్‌లో క్రిస్మన్‌ సందర్భంగా ఈ సినిమాను విడుదల చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement