Monday, July 22, 2024

AP : నేడు మహారాష్ట్రకు చంద్రబాబు

ఇవాళ మహారాష్ట్రకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు వెళ్లనున్నారు. కొల్హాపూర్‌లోని శ్రీ మహాలక్షి ఆలయాన్ని బాబు సందర్శించనున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం షిరిడీ సాయిబాబాను దర్శించుకొనున్నారు.

- Advertisement -

ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆయన వరసగా ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఇటీవల మోదీ నామినేషన్ వేయడానికి వారణాసికి వెళ్లిన చంద్రబాబు నేడు మహారాష్ట్ర వెళ్లనున్నారు. ప్రచారాన్ని ముగించిన సమయంలోనూ చంద్రబాబు చివరి రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement