Wednesday, May 8, 2024

పవన్ రెమ్యునరేషన్ పై రకరకాల రూమర్స్…ఏది నిజం ? ఏది అబద్ధం ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ మంచి సక్సెస్ సాధించడంతో పాటు వసూళ్లు కూడా అదే స్థాయిలో రాబట్టాడు. అలాగే ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. అలాగే సాగర్ కె చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ లో కూడా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమా షూటింగ్ కి పవన్ కు రోజుకి కోటి రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తున్నారట.అలా ఎన్ని రోజులు పవన్ షూటింగ్ కు వస్తే అన్ని కోట్లు ఇవ్వాల్సిందేనాట. ఇక ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాకి 50 కోట్ల రెమ్యూనరేషన్ తో పాటు మరో పదిహేను కోట్ల రూపాయలను లాభాల్లో కూడా తీసుకున్నాడని తెలుస్తోంది. అయితే ఇది ఆఫీషియల్ గా వచ్చిన సమాచారం మాత్రం కాదు. సోషల్ మీడియాలో రూమర్స్ మాత్రమే. నిజానికి పవన్ సినిమాకు ఎంత తీసుకున్నాడు అనేది ఎవరికీ తెలియదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement