Friday, May 3, 2024

ఏపీ లో మాస్కు ధరించకపోతే 100 జరిమానా: అనిల్ సింఘాల్

ఏపీలో కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉందిన్నారు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ సింఘాల్. మాస్కు ధరించకపోతే రూ.100 జరిమానా విధిస్తున్నట్లుతెలుపారు. ఏపీలో కరోనా నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. కేసులు ఎక్కువ పెరుగుతుండడంతో కోవిడ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం 21 వేల మంది వైద్య సిబ్బందిని విధుల్లో చేర్చుకోనున్నట్లు చెప్పారు. దీనికోసం ఆస్పత్రులు, ఔషధాలు, పడకలు సిద్ధం చేయాలని అధికారులకు తెలిపారు అనిల్ సింఘాల్.

ఇక ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 36 వేల రెమ్‍డెసివిర్ ఇంజెక్షన్లు ఉన్నాయని.. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో 8 వేల రెమ్‍డెసివిర్ డోసులు ఉన్నాయని ఆయన అన్నారు. మరో నాలుగు లక్షల ఇంజెక్షన్లు సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. ఇక ప్రస్తుతం అందుబాటులో 320 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉందని.. చెన్నై, బళ్లారి నుంచి మరో 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వస్తుంది తెలిపారు. రాష్ట్రంలో ఆక్సిజన్, రెమ్‍డెసివిర్ అవసరం అంతగా లేదన్నారు అనిల్ సింఘాల్. 19 వేల పడకలు సిద్ధం చేస్తే 11 వేల పడకలు నిండాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement