Friday, April 26, 2024

హాకీ స్టిక్ పట్టుకోబోతున్న వైష్ణవ్ తేజ్ !!

ఉప్పెన సినిమా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో పాటు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు ఇంకో రెండు సినిమాలను కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.

మరో సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ పై నాగార్జున నిర్మాతగా మరో సినిమాకి వైష్ణవ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే నాగార్జున నిర్మించే సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇందులో హాకీ ప్లేయర్ గా కనిపించనున్నాడట వైష్ణవ్. దీనికోసం ఇప్పటికే ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడట. పృథ్వి అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement