Saturday, April 27, 2024

అల్లుఅర్జున్ కావాలనే లీక్ చేశాడా ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రేజీ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్ప రాజు గా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎక్కువగా ఓ పదాన్ని ఊత పదం కింద వాడుతూ ఉంటాడట. అది మరేదో కాదు…’తగ్గేదే లే’.. అంటూ పుష్ప సినిమాలో బన్నీ ఎక్కువగా వాడతారట.

ఇటీవల కార్తికేయ హీరో గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చావు కబురు చల్లగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఆ పదాన్ని పలికాడు. పుష్ప సినిమాలో కూడా బన్నీ ఊతపదం ఇదే అంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మరి ఆ పదం అదో కాదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement