Thursday, May 16, 2024

ఉస్తాద్‌ వస్తున్నాడు.. ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ ఎప్పుడంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ తో కలిసి చేస్తున్న మాస్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌ ఈ గురువారం రిలీజ్ కానున్నట్టు ఇప్పటికే వెల్లడించారు మేకర్స్. కాగా, ఇప్పుడు ఈ ఫస్ట్ గ్లింప్స్ హైదరాబాద్‌లోని సంధ్య 35 MM థియేటర్‌లో మే 11 సాయంత్రం 04:59 గంటలకు లాంఛ్ చేయనున్నట్లు టీమ్ ప్రకటించింది.

అదే సమయంలో డిజిటల్ విడుదల కూడా జరుగుతుందా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. హరీష్ శంకర్ గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చారు. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement