Friday, May 3, 2024

యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో.. ఖుషీ ఫ‌స్ట్ సింగిల్

యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది ఖుషీ మూవీ ఫ‌స్ట్ సింగిల్. ఈ విషయాన్ని పోస్టర్ ద్వారా ఈ చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసింది. యుట్యూబ్ లో వరల్డ్ టాప్ ఆల్బమ్ లిస్టులో ఖుషి తెలుగు వెర్షన్ సాంగ్ టాప్ 4లో ఉండగా హిందీ వెర్షన్ సాంగ్ 8వ స్థానంలో ఉండటం విశేషం. దీనిని బట్టి ఈ సాంగ్ కి ఏ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందో ఊహించుకోవచ్చు. శివ నిర్వాణ ఈ పాటకి సాహిత్యం అందించగా మ్యూజిక్ డైరెక్టర్ హిషామ్ అబ్దుల్ వాహబ్ స్వరపరిచి అతనే పాటని ఆలపించారు. మెలోడీయస్ గా సాగే ఈ సాంగ్ కి మంచి స్పందన వస్తూ అన్ని భాషలలో కలిపి 15 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకోవడం విశేషం. ఈ సాంగ్ ద్వారా శివ నిర్వాణలో మంచి లెరిక్ రైటర్ కూడా ఉన్నాడని ప్రూవ్ చేసుకున్నాడు.మూవీ థీమ్ ని ప్రెజెంట్ చేస్తూనే ఆహ్లాదంగా ఉండటంతో ఈ సాంగ్ కి యుట్యూబ్ లో విశేష మైన ఆదరణ వస్తోన్నట్లు తెలుస్తోంది. కాగా పాన్ ఇండియా రేంజ్ లో ఖుషీ మూవీని ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోగా విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తుండ‌గా.. హీరోయిన్ గా స‌మంత న‌టిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement