Sunday, May 5, 2024

Tillu Square | ‘టిల్లు 2’ సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న బ్లాక్ బ‌స్ట‌ర్ సీక్వెల్‌ ప్రాజెక్ట్‌ టిల్లు 2. మల్లిక్‌రామ్ దర్శకత్వంతో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇక‌, సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన‌ ఫన్ సాంగ్ ‘‘టికెటే కొనకుండా’’ పాటకు మంచి స్పందన వస్తోంది. ఇక తాజాగా, ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ప్రోమోను విడుద‌ల చేశారు మేక‌ర్స్.

YouTube video

ఈ పాటకి కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిగా.. రామ్ మిరియాల సంగీతం అందిస్తూ పాటని పాడారు. సాంగ్ చూడడానికి చాలా కలర్ ఫుల్ గా ఉంది. ఇక ఈ పాట ఫుల్ వర్షెన్ నవంబర్ 27న సాయంత్రం 4:05 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సెప్టెంబర్ లోనే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ వచ్చే ఏడాదికి పోస్టుపోన్ అయ్యింది. 2024 ఫిబ్రవరి 9న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement