Wednesday, May 15, 2024

Operation Valentine కొత్త రిలీజ్ డేట్ ఇదే !

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా.. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘‘ఆపరేషన్ వాలెంటైన్’’. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్, ఫస్ట్ సాంగ్ అందరినీ ఆకట్టుకున్నాయి.

అయితే ఈ నెల ఫిబ్రవరి 16న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ కొన్ని కారణాల వలన వాయిదా పడింది. కాగా, తాజాగా ఇక నేడు తమ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేసారు మేకర్స్. ఈ సినిమాని మార్చి 1న ఆడియన్స్ ముందుకు రానున్నట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్, రెనైసెన్సే పిక్చర్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement