Saturday, April 27, 2024

వకీల్ సాబ్ ఎంట్రీనే హైలెట్ అంటున్నారు గురూ !!

దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం బాలీవుడ్ లో అమితాబ్ నటించిన సినిమా పింక్ సినిమాకు రీమేక్. కాగా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 9న థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ టీజర్ లకు విశేష స్పందన లభించింది. సోషల్ మీడియాలో అయితే ట్రైలర్ కొన్ని రికార్డులను కూడా బ్రేక్ చేసింది.

అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ పై ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పవన్ ఎంట్రీ సీన్ లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ తో ఉండనుందట. అంతేకాదు యాక్షన్ సీన్ పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ స్టైల్ తో ఉంటుందట. అభిమానులతో పాటు మాస్ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అయ్యే విధంగా పవన్ ఎంట్రీ ని వేణు శ్రీరామ్ చూపించారట.

ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే నివేదాథామస్ ,అంజలి,అనన్య కీలకపాత్రలో నటించారు. అలాగే ప్రకాష్ రాజ్ కూడా మరో కీలకమైన పాత్రలో నటించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బోనికపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement