Sunday, April 28, 2024

1 ట్రెండ్ లో బింబిసార…1.5మిలియన్ వ్యూస్

నందమూరి కళ్యాణ్ రామ్ వశిష్ట్ దర్శకత్వంలో బింబిసార సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నందమూరి తారకరామారావు 98వ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ఎనౌన్స్ చేశారు. ఎవ్వరు టచ్ చేయని ఒక సాలిడ్ కాన్సెప్ట్ తో నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇదిలా ఉండగా టైటిల్ ఎనౌన్స్ మెంట్ ఇచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. యూట్యూబ్ లో నెంబర్ వన్ స్థానం లో నిలిచి 1.5 మిలియన్ కి పైగా వ్యూస్ సంపాదించి ట్రెండ్ లో నిలిచింది. అయితే నందమూరి అభిమానులు ఎవరూ కూడా కళ్యాణ్ రామ్ నుంచి ఇలాంటి అప్డేట్ వస్తుందని ఊహించి ఉండరు.

కానీ ఈ అప్డేట్ చూసిన తర్వాత మంచి జోష్ మీద ఉన్నారు ఫ్యాన్స్. ఇక ఈ సినిమాలో కేథరిన్ అలాగే సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement