Saturday, May 11, 2024

అన్నమయ్య సంకీర్తనలు

నిత్యానంద

నిత్యానంద ధరణీధర ధరారమణ
కాత్యాయనీస్తోత్ర కామ కమలాక్ష || ||నిత్యానంద ||

అరవిందనాభ జగదాధారా భవదూర
పురుషోత్తమ నమో భువనేశ
కరుణాసమగ్ర రాక్షసలోక సంహార –
కరుణ కమలాధీశ కరిరాజవరద || ||నిత్యానంద ||

భోగీంద్రశయన పరిపూర్ణ పూర్ణానంద
సాగరనిజావాస సకలాధిప
నాగారిగమన నానావర్ణనిజదేహ
భాగీరథీజనక పరమ పరమాత్మ || ||నిత్యానంద ||

పావన పరాత్పర శుభప్రద పరాతీత
కైవల్యకాంత శృంగారరమణ
శ్రీ వేంకటేశ దాక్షిణ్యగుణనిధి నమో
దేవతారాధ్య సుస్థిరకృపాభరణ || ||నిత్యానంద ||

Advertisement

తాజా వార్తలు

Advertisement