Friday, April 26, 2024

ఖిలాడీ టీజర్ వచ్చేస్తుంది…గెట్ రెడి

మాస్ మహారాజా రవితేజ లాంగ్ గ్యాప్ తర్వాత క్రాక్ సినిమాతో హిట్ ని అందుకున్నాడు. అదే జోష్ లో ప్రస్తుతం ఖిలాడీ సినిమా కూడా చేస్తున్నాడు. అయితే రవితేజకు కరోనా మహమ్మారి షాకిచ్చింది. ఇటలీలో యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్న యూనిట్ కు అక్కడ ప్రభుత్వం షూటింగ్ పర్మిషన్ లను రద్దు చేసింది. దీంతో సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా లేదా అనే అనుమానాలు సినీ అభిమానుల్లో స్టార్ట్ అయ్యాయి.

కానీ ఖిలాడి టీం మాత్రం టైంకే సినిమాని రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా కిలాడి సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఏప్రిల్ 12న ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాలకు ఖాలాడీ టీజర్ రాబోతోందంటూ యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను మే 28న రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, మోషన్ పోస్టర్ కు విశేష స్పందన లభించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement