Monday, April 29, 2024

అలెర్ట్… RRR వెనుక రహస్యం ఏంటి ?

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రంపై రోజురోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలకు సంబంధించిన వీడియోలు సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను నెలకొల్పాయి. ఇక రేపు అజయ్ దేవగన్ పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమాలో ఆయన పాత్రకు సంబందించిన లుక్ ను విడుదల చేయనున్నారు.

ఇదిలా ఉండగా మరోసారి ఆర్ ఆర్ ఆర్ చిత్రయూనిట్ హీట్ వేవ్ అలెర్ట్ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ కి అర్థం ఏంటి ఎందుకు పెట్టారు అనేది మాత్రం తెలియట్లేదు. ఈ కన్ఫ్యూజన్ లోనే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ నటిస్తోంది. అలాగే ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ నటిస్తుంది. అజయ్ దేవగన్ , సముద్రఖని,శ్రీయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 13 న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement