Thursday, May 2, 2024

తెలంగాణ‌కు 12 జాతీయ అవార్డులు…

ఉత్తమ పంచాయతీలుగా 9 గ్రామాలు
జిల్లా పరిషత్‌కు ఒకటి, మండల పరిషత్‌కు రెండు జాతీయ అవార్డులు
హైదరాబాద్‌, : జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి మూడు కేటగిరిలలో 12 ఉత్తమ అవార్డులు దక్కాయి. 2021 సంవత్సరానికిగానూ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తీకరణ పురస్కారాలను కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ ప్రకటించింది. ఇందులో తెలంగాణ 9 ఉత్తమ గ్రామ పంచాయతీ, 2 మండల పరిషత్‌, ఒకటి జిల్లా పరి షత్‌ అవార్డులకు ఎంపికైనట్లు కేంద్ర పంచాయతీ రాజ్‌ మంత్రిత్వశాఖ బుధవారం తెలంగాణ ప్రభు త్వానికి లేఖలో తెలిపింది. ఈ ఏడాది తెలంగాణ నుండి ఉత్తమ జిల్లా పరిషత్‌గా మెదక్‌, మండల పరిషత్‌ కేట గిరిలో కోరుట్ల మండలం, జగిత్యాల జిల్లా, ధర్మారం మండలం, పెద్దపల్లి జిల్లాలు ఎంపికయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement