Sunday, April 28, 2024

ఊర్వ‌శి రౌతెల్లా నెక్లెస్.. రూ.276కోట్లా

హీరోయ‌న్ ఊర్వ‌శి రౌతెల్లా 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‏ ‏లో పాల్గొంది. ఆమె పింక్ టల్లే గౌనులో అద్భుతంగా కనిపించింది. ముఖ్యంగా ఆమె ధరించిన మొసలి నెక్లెస్ నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఆమె ధరించిన మొసలి నెక్లెస్ నకిలీదని కామెంట్స్ వచ్చాయి. తాజాగా ఈ ట్రోల్స్ పై ఊర్వశీ పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఆమె ధరించిన నెక్లెస్ విలువ రూ. 276 కోట్లు అని పేర్కొంది.పింక్ టల్లే గౌనులో ఊర్వశి అచ్చం బార్బీ డాల్‏లా కనిపించి అందిరి దృష్టిని ఆకర్షించింది. ఎంతో అందంగా ముస్తాబయిన ఊర్వశి మెడలో తనకెంతో ఇష్టమైన మొసలి నెక్లెస్, చెవులకు మొసలి రింగులు పెట్టుకుంది. దీంతో ఆమె ధరించిన ఆభరణాలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే మొదలైంది. ఫేక్ నెక్లెస్ అంటూ ట్రోల్స్ కాగా.. ఆమె టీమ్ స్పందిస్తూ.. ఆ నెక్లెస్ ధర రూ. 276 కోట్లు అని.. అది ఆమె ఫ్యాషన్ అభిరుచిని తెలుపుతుందని.. మహిళలు ఎదుర్కొనే సవాళ్లు, విజయాలు రెండింటికి ఇది చిహ్నం అని పేర్కొంది. మొసలి నెక్లెస్ ధర తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement