Sunday, April 28, 2024

నాగ శౌర్య నుదిటిపై ముద్దు పెట్టిన హీరోయిన్

నాగ శౌర్య హీరోగా ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా నేపధ్యంలో తెరకెక్కుతున్న చిత్రం లక్ష్య. సుబ్రమణ్య పురం ఫేమ్ సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శరత్ మరార్, నారాయణ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక అలాగే కాలభైరవ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ఈ స్పోర్ట్స్ డ్రామాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కేతికశర్మ….నాగశౌర్య నుదుటిపై ముద్దు పెడుతూ… ఈ పోస్టర్ లో కనిపించింది. ఇక లక్ష్య త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ఈ పోస్టర్ ద్వారా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement