Saturday, April 27, 2024

విజయ్ @ 65 మూవీ

ఈ ఏడాది ‘మాస్టర్’ సినిమా విజయంతో జోష్ లో ఉన్న తమిళ స్టార్ హీరో విజయ్.. వరుస సినమాలను లైన్ లో పెట్టాడు. తాజాగా విజయ్ తన 65వ చిత్రాన్ని మొదలు పెట్టాడు. ఈ మూవీ పూజా కార్యక్రమాలతో చెన్నయ్ లోని ఘనంగా జరిగింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. అందాల తార పూజా హెగ్డే ఈ మూవీతో మరోసారి కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. రేపటి నుండి ఈ సినిమార ఎగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన విజయ్ ‘మాస్టర్’ మూవీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ తాజా చిత్రాన్ని కూడా శరవేగంతో పూర్తి చేసి, ఈ ఏడాది దీపావళి లేదా వచ్చే పొంగల్ కు విడుదల చేయాని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. విజయ్ కొత్త సినిమా మొదలు పెట్టడంతో ఆయన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement