Sunday, April 28, 2024

విజయ్ దళపతి తెలుగు ఎంట్రీ ఫిక్స్…లేటెస్ట్ అప్డేట్

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.  విజయ్ కి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది.  అయితే తెలుగులో డైరెక్ట్ గా విజయ్ ను ఎంట్రీ చేసేందుకు చాలా మంది దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.  కానీ అది వర్కౌట్ కాలేదు. ఎట్టకేలకు విజయ్ డైరెక్ట్ గా తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.  వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కబోతోంది.

 అందుకు సంబంధించి అధికారికంగా డైరెక్టర్ వంశీ ప్రకటన చేశారు. కరోనా పరిస్థితులు చక్కబడ్డాక జూలైలో ఈ సినిమా ప్రారంభం కానుందని క్లారిటీ ఇచ్చారు. అయితే విజయ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.  నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమా తర్వాత వంశీ తో విజయ్ సినిమా చేయబోతున్నారట.  కాగా ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు టెక్నీషియన్స్ గురించి త్వరలోనే వివరాలు ప్రకటించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement