Thursday, May 2, 2024

నో టెన్షన్.. బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లు వచ్చేశాయ్!

దేశాన్ని కరోనా మహమ్మారికి వెంటాడుతుంటే.. మరోవైపు బ్లాక్ ఫంగస్ కలవర పెడుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలా మంది బ్లాక్ ఫంగస్ బారిన పడి చనిపోయారు. ఈ నేపథ్యంలో కేంద్రం చర్యలు చేపట్టింది. ఆదివారం బ్లాక్​ ఫంగస్ చికిత్సలో ఉపయోగించే యాంఫోటెరిసిన్​- బీ ఇంజెక్షన్లు భారత్​కు చేరుకున్నాయి. మొత్తం 2 లక్షల డోసులు వచ్చాయి. ఈ మేరకు అమెరికాలోని భారత రాయబారి తరణ్​జిత్​ సింగ్​ సంధూ ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.

మ్యుకర్‌మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌) వ్యాధి చికిత్సలో యాంఫోటెరిసిన్​ బీ మందు వాడుతారు. కరోనా నుంచి కోలుకున్నవారిలో బ్లాక్‌ ఫంగస్‌ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహం ఉన్న వారు దీని బారిన పడుతున్నారు. స్టైరాయిడ్లు ఎక్కువగా వాడే వారికి బ్లాక్​ ఫంగస్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్టైరాయిడ్లను వైద్యుల సూచన మేరకే తీసుకోవాలని చెబుతున్నారు. ఈ ఇన్‌ఫెక్షన్‌ సోకినవారిలో కళ్లు, ముక్కు చుట్టూ ఎర్రబారడం, నొప్పి తలెత్తడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, ఊపిరి అందకపోవడం, రక్తవాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement