Friday, May 10, 2024

‘ప్రేమ కాదంట’ అల్లుశిరీష్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ అదిరిపోయింది

అల్లు శిరీష్ కెరీర్ ను ప్రారంభించి చాలా ఏళ్లు అవుతున్నా హీరోగా నిలదొక్కుకోలేక పోతున్నాడు. ప్రస్తుతం రాకేష్ శశి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కాగా గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో సినిమాపై ఆసక్తిని పెంచిన చిత్ర యూనిట్ అల్లు శిరీష్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ని అలాగే టైటిల్ ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి ప్రేమ కాదంట అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని పెట్టారు. ఇక ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఫస్ట్ లుక్ తో పాటు మరో లుక్ ని కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

రెండింటిలో కూడా రొమాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాను జీఏ2పిక్చ‌ర్స్ బ్యాన‌ర్, మ‌రో నిర్మాణ సంస్థ శ్రీ తిరుమ‌ల ప్రొడ‌క్ష‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో క‌లిసి ఈ న్యూఏజ్ ల‌వ్ స్టోరీని నిర్మిస్తున్నారు.

https://twitter.com/AlluSirish/status/1398876715204505607
Advertisement

తాజా వార్తలు

Advertisement