Thursday, May 2, 2024

చరణ్ కంటే దర్శకుడికి పది కోట్లు ఎక్కువట?

సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ కెరీర్ లో 15వ చిత్రంగా ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే ఇక శంకర్ సినిమాలంటే బడ్జెట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే రెమ్యూనరేషన్ విషయంలో కూడా శంకర్ వెనక్కి తగ్గరనే టాక్ ముందు నుంచి ఉంది.

అయితే గత కొన్ని రోజులుగా శంకర్ రామ్ చరణ్ రెమ్యూనరేషన్ గురించి రకరకాల వార్తలు తెరపైకి రాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం… రామ్ చరణ్ కంటే శంకర్ ఎక్కువ పారితోషికం అందుకుంటున్నారట. దాదాపు పది కోట్ల రూపాయలు చరణ్ కంటే శంకర్ అదనంగా తీసుకుంటున్నాడట. అయితే సినిమా విడుదల తర్వాత చరణ్ కు లాభాల్లో వాటా ఉంటుందని కూడా అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో వారికే తెలియాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement