Saturday, April 27, 2024

డ్రైవర్ కు కరోనా పాజిటివ్…టెస్ట్ లు సూపర్ స్టార్ ఫ్యామిలీ ?

మనం ఎంత కాదనుకున్నా మనకు రావాల్సింది ఖచ్చితంగా వచ్చి తీరుతుందని పెద్దలు అంటూ ఉంటారు. అవును ప్రస్తుతం మహేష్ బాబు పరిస్థితి కూడా అలానే మారింది. ఇటీవల కాలంలో మాస్క్ లు పెట్టుకున్నప్పటికీ, శానిటైజర్ లు వాడుతున్నప్పటికీ కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతూనే ఉంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు కూడా ఈ మహమ్మారి సోకింది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు డ్రైవర్ కి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రఖ్యాత యాహు కథనం ప్రకారం డ్రైవర్ కి పాజిటివ్ అని తెలియగానే మహేష్ బాబు ,నమ్రత సహా కుటుంబసభ్యులంతా పరీక్షలు చేయించుకున్నారట. అయితే వారందరికీ కూడా నెగిటివ్ గా తేలిందట. దీంతో కుటుంబ సభ్యులు అందరూ ఊపిరి పీల్చుకున్నారట. ఇక ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ మొదట బయపడినప్పటికి నెగిటివ్ అని తెలియడంతో హమ్మయ్య అనుకున్నారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement