Sunday, May 5, 2024

ఆక్సిజన్ కోసం…సుకుమార్ 25 లక్షలు

కరోనా కష్ట కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు సహాయం చేయడానికి ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పలువురు సినీ ప్రముఖులు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తుండగా… ఆ లిస్టు లో స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ కూడా చేరారు. సుకుమార్ 25 లక్షలతో కోనసీమ ప్రాంతంలో అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లను సహా, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను లను ఏర్పాటు చేశారు. తన స్నేహితుల సహాయంతో మొదటగా నాలుగు ఆక్సిజన్ సిలిండర్ ను తీసుకువచ్చారు.

ఇంకో నాలుగైదు రోజుల్లో మొత్తం అంతా సప్లై జరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ విపత్కర సమయంలో ఎవరూ ప్రాణాలు కోల్పో కూడదని ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇక ఈ సమయంలో తానే స్వయంగా ఇలాంటి పనులన్నీ చూసుకోవడం గొప్ప విషయం అని సినీ అభిమానులు అంటున్నారు. అలాగే ప్రస్తుతం సుకుమార్ పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement