Friday, May 3, 2024

తమ్ముడికి స్టైలిష్ స్టార్ అభినందనలు

సైలిష్ స్టార్ అల్లుఅర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ ను తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. అయితే అల్లు శిరీష్ మూడు నాలుగు సినిమాలు చేసినప్పటికీ ఆ సినిమాలు పెద్దగా రాణించలేకపోయాయి. ఇదిలా ఉండగా గత ఏడాది మార్చి 24 న శిరీష్ ఇండీ మ్యూజిక్ ఆల్బమ్ ‘విలయాటి షరాబ్ ను రిలీజ్ చేశాడు. అయితే యూట్యూబ్ ఈ ఆల్బమ్ దుమ్ము రేపుతోంది.దర్శన్ రావల్ నీతి మోహన్ పాడిన ఈ మ్యూజిక్ వీడియోను అల్లు శిరీష్‌, హేలీ దారువాలపై చిత్రీకరించారు.

కాగా ఈ వీడియోకు యుట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ లభించాయి. అయితే తన సోదరుడు నటించిన ఈ వీడియోకు 100 మిలియన్ వ్యూస్ రావటం పట్ల ఇంస్టాగ్రామ్ వేదికగా అల్లుఅర్జున్ అభినందనలు తెలిపారు.

https://www.instagram.com/p/CNriktHHptQ/?igshid=a8g3dz8k1z2o

Advertisement

తాజా వార్తలు

Advertisement