Wednesday, May 8, 2024

రావ‌ణ‌సుర అంద‌రినీ అల‌రిస్తుంది….

మాస్‌ మహారాజా రవితేజ తాజా చిత్రం ‘రావణాసుర’. సుధీర్‌ వర్మ దర్శకుడు. అభిషేక్‌ నామా, రవితేజ నిర్మిస్తున్నారు. సుశాంత్‌ కీలక పాత్ర పోషించారు. ఏప్రిల్‌ 7న సమ్మర్‌ రిలీజ్‌ కాబోతున్న నేపథ్యంలో దర్శకుడు సుధీర్‌ వర్మ రావణాసుర విశేషాలని మీడియా సమావేశంలో పంచుకున్నారు.
రావణాసుర ఎలా వుంటు-ంది ?
రావణాసుర సూపర్‌ ఎక్సయి-టె-డ్‌గా వుంటు-ంది. సినిమాలో థ్రిల్స్‌, షాకింగ్‌ ఎలిమెంట్స్‌ ప్రధాన ఆకర్షణగా వుంటాయి. అందులో ఏది రివి ల్‌ చేసినా సినిమా చూసినప్పు డు ఆ థ్రిల్‌ వుండదు.
రవితేజతో థ్రిల్లర్‌ జోనర్‌ సినిమా చేయాలని ఆలోచన ఎలా వచ్చింది ?
శ్రీకాంత్‌ కథ చెప్పినపు డు రవితేజ గారికి నచ్చి, నేనైతే బావుంటు-దని నా దగ్గరికి పంపిం చారు. కథ విన్నప్పుడు ఇలాంటి థ్రిల్లర్‌ ని ఓ పెద్ద హీరో చేయడం ఇంకా ఎక్సయి-టె-డ్‌ గా అనిపించింది. ఇలాంటి కథ ఇప్పటివరకూ తెలుగులో రాలేదు.


పుష్ప, కేజీఎఫ్‌.. ఇలా గత రెండేళ్ళుగా హీరోలని గ్రే షేడ్స్‌ లో చూపిస్తున్నారు ?
గ్రే షేడ్స్‌ అనేది చాలా కాలంగా వుంది. అంతంలో నాగార్జున, సత్యలో జేడీ ఇవన్నీ గ్రేనే కదా.
సినిమాలో చాలా మంది నటీ-నటు-లు వున్నారు కదా ?
అవును కథలో ఇంతమంది వున్నారు .. ఏం చేస్తారనే క్యురియాసిటీ-నే కావాలి.
వేరే రచయిత కథని డైరెక్ట్‌ చేయడం ఎలా వుంటు-ంది?
ఖచ్చితంగా ఒక సవాల్‌ వుంటు-ంది. నా కథ అయితే నా విజువల్‌ సెన్సిబిలిటీ-కి తగట్టు- రాసుకుంటాను. ఏదైనా మార్పు చేయడం కూడా సులువుగా వుంటు-ంది. వేరే కథలో మార్పు చేసినప్పుడు ఆ మార్పు మిగతా ఏరియాల్లో ఎంత ఎఫెక్ట్‌ చూపిస్తుందనేది రచయితతో కూర్చుని క్రాస్‌ చెక్‌ చేసుకోవాలి.
రవితేజ గారి అభినయం గురించి ?
రవితేజ గారి గురించి మనందరికీ తెలుసు. నా విజన్‌ కి బెటర్‌ గానే ఆయన పెర్ఫార్మన్స్‌ చేస్తారు. కంప్లీట్‌ రవితేజ గారి సినిమా.
మీరు ఎక్కువగా థ్రిల్లర్స్‌ చేయడానికి కారణం ?
నాకు -కై-మ్‌ జోనర్‌ మీద సినిమా రన్‌ చేయడం ఇష్టం.
నిర్మాత అభిషేక్‌ గారితో పని చేయడం గురించి ?
అభిషేక్‌ గారితో నాకు ఇది రెండో సినిమా. నేను ఉన్నంత వరకూ ఆయన అన్ని వదిలేస్తారు. సుధీర్‌ ఏం అడిగితే అది ఇచ్చేయండి అని చెప్తారు.
రావణాసురని అన్ని భాషల్లో విడుదల చేయాలనే ఆలోచన రాలేదా ?
ముందు అనుకున్నాం. హిందీ , తమి ళ్‌లో విడుదల చేయాలని అనుకున్నాం. కానీ వాళ్ళకి పది హేను రోజులు ముందు కాపీ పంపించాలి. అయితే మేము ఏదైతే దాస్తూ వచ్చామో ఆ ఎలిమెంట్స్‌ బయటికి వచ్చేస్తా యనే భయంతో ముందు తెలుగులోనే విడుదల చేయాలని అనుకున్నాం. సెకండ్‌ వీక్‌ నుంచి హిందీ ప్లాన్‌ చేస్తున్నాం.
ఎవరికీ రివిల్‌ చేయకూడదు, ఇంత సీక్రెట్‌ గా వుంచాలని అనుకోవడం కూడా రిస్కే కదా ?
నిజంగా ఇది రిస్కే. అయితే ఎప్పుడైతే కథ విన్న తర్వాత ఒక ఎక్సయిట్‌ మెంట్‌ వచ్చిందో ఆడియన్స్‌ కి కూడా ఆ ఎక్సయి-టె-్మంట్‌ని ఇవ్వాలని అనుకున్నాం.
పవన్‌ కళ్యాణ్‌ గారితో సినిమా గురించి ?
అది త్రివిక్రమ్‌ గారి కథతో వుంటు-ంది. ఎప్పుడు ఏమిటి అనేది త్వరలో తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement