Tuesday, May 7, 2024

యుజీఈటీ కోసం కొమెడ్‌ కె యుని–గేజ్‌ ప్రవేశ పరీక్ష : అప్లికేషన్‌ తేదీల ప్రకటన

కొమెడ్‌ కె యుజీఈటీ, యుని గేజ్‌ ప్రవేశ పరీక్షలు మే 28 ఆదివారం జరుగనున్నాయి. దాదాపు 150 ఇంజినీరింగ్‌ కళాశాలలు 50కు పైగా సుప్రసిద్ధ ప్రైవేట్‌, డీమ్డ్‌ యూనివర్శిటీలలో ప్రవేశాల కోసం ఉమ్మడి పరీక్షగా దీనిని నిర్వహించనున్నారు. ఈ అప్లికేషన్‌ ప్రక్రియ ఆన్‌లైన్‌లో తెరిచారు. 2023 ఏప్రిల్ 24వ‌ తేదీ వరకూ దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షలను ఆన్‌లైన్‌లో భారతదేశ వ్యాప్తంగా 150 నగరాలలో 400కు పైగా టెస్ట్‌ కేంద్రాలలో నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా కొమెడ్‌ కె ఎగ్జిక్యూటివ్‌ సెక్రటరీ డాక్టర్‌ కుమార్‌ మాట్లాడుతూ… కర్నాటకలో సుప్రసిద్ధ ఇంజినీరింగ్‌లో చేరాలనుకునే అభ్యర్థులను ఆహ్వానిస్తున్నామ‌న్నారు. యుజీఈటీ ద్వారా విద్యార్థులను 150కు పైగా ప్రీమియర్‌ కళాశాలలు అంగీకరిస్తున్నాయన్నారు. ఎరా ఫౌండేషన్‌ సీఈఓ పీ మురళీధర్‌ మాట్లాడుతూ… మెరిట్‌, ఆప్టిట్యూడ్‌ మాత్రమే విద్యార్ధులు తమ విద్యను మరింతగా ముందుకు తీసుకుపోవడానికి కీలకమని భావిస్తున్నామన్నారు. యుని–గేజ్‌ ఒక టెస్టింగ్‌ ప్లాట్‌ఫామ్‌గా అత్యున్నత ప్రమాణాలతో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు. రేపటి శ్రామికశక్తి సమగ్ర అభివృద్ధికి త‌మ వంతుగా తోడ్పడనున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement