Wednesday, May 15, 2024

త్వరలోనే ‘జైలర్ – 2’.. స్క్రిప్ట్ పై నెల్సన్‌ కసరత్తులు

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘జైలర్’. బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలించింది ఈ మూవీ. కాగా ఈ సినిమాకి సీక్వెల్‌ గా జైలర్-2 త్వరలో పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే, ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్‌ను డైరెక్టర్‌ నెల్సన్ మొదలుపెట్టాడట.

కాగా స్క్రిప్ట్ కూడా ఫుల్ యాక్షన్ డ్రామాగా రాబోతుంది అని తెలుస్తోంది. ముఖ్యంగా రజనీకాంత్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయట. ఇక ఈ జైలర్ 2 లో కూడా తమన్నా, యోగిబాబు, వినాయకన్, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించబోతున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ జైలర్ 2 ను కూడా గ్రాండ్ గా నిర్మించబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement